వేల సంఖ్యలో మెసేజ్‌లొస్తున్నాయి - దీపికా పదుకొనే | 'Live Love Laugh' company fonding by deepika padukone | Sakshi
Sakshi News home page

వేల సంఖ్యలో మెసేజ్‌లొస్తున్నాయి - దీపికా పదుకొనే

Dec 22 2015 11:37 PM | Updated on Sep 3 2017 2:24 PM

వేల సంఖ్యలో మెసేజ్‌లొస్తున్నాయి - దీపికా పదుకొనే

వేల సంఖ్యలో మెసేజ్‌లొస్తున్నాయి - దీపికా పదుకొనే

సినీ తారలు ఏం చేసినా పబ్లిసిటీ స్టంట్ అంటారు. పాపం... మంచి పని చేసినా, మంచి విషయం మాట్లాడినా ఇదంతా కేవలం డబ్బు కోసమే అని చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

సినీ తారలు ఏం చేసినా పబ్లిసిటీ స్టంట్ అంటారు. పాపం... మంచి పని చేసినా, మంచి విషయం మాట్లాడినా  ఇదంతా కేవలం డబ్బు కోసమే అని చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు . దీపిక క్కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బాలీవుడ్‌లో మిగతా కథానాయికలతో పోలిస్తే దీపిక  సమ్‌థింగ్ స్పెషల్.  తన మనసుకు నచ్చినట్టు మాట్లాడటం దీపికకు ఉన్న ప్రత్యేకత .
 
 అయితే దీపిక ఇంత ధైర్యంగా గతంలో ఉండేవారు కాదు. కొన్నాళ్లపాటు ఆమె తీవ్రాతితీవ్రంగా డిప్రెషన్‌తో కుంగిపోయారు. తర్వాత బయట పడ్డారనుకోండి. అయితే చాలా మంది అలాంటి విషయాలు మీడియా ముందు చెప్పరు. కానీ దీపిక చాలా ధైర్యంగా తన మానసిక పరిస్థితి గురించి చెప్పేశారు.అంతేకాకుండా  తనలా డిప్రెషన్‌లో కుంగిపోయిన వారికి అండగా నిలబడటం కోసం ‘ లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను నెలకొల్పారు.  ‘‘ కేవలం  ఫార్మాస్యూటికల్ కంపెనీకి ప్రచారం కోసం ఈ సంస్థ నెలకొల్పారని, ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది నన్ను మొదట్లో విమర్శించారు.
 
  కానీ ఈ సంస్థ గురించి వస్తున్న రెస్పాన్స్  మాత్రం సూపర్బ్.  మీ వల్ల నా ప్రాణం నిలబడింద ని చెబుతూ ఓ అమ్మాయి నాకు సందేశం పంపింది. అదొక్కటి చాలు. ఇలాంటి మెసేజ్‌లు కొన్ని వేల సంఖ్యల్లో వస్తున్నాయి.  నాలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ .అంతేగానీ  డబ్బు సంపాదించాలన్న అత్యాశ మాత్రం కాదు’’ అని దీపిక స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement