పెద్దన్నయ్యా వద్దన్నయ్యా | covid-19 effects: rajinikanth annathe shooting postponed | Sakshi
Sakshi News home page

పెద్దన్నయ్యా వద్దన్నయ్యా

Mar 6 2020 2:31 AM | Updated on Mar 6 2020 2:31 AM

covid-19 effects: rajinikanth annathe shooting postponed - Sakshi

రజనీకాంత్‌

కరోనా వైరస్సే ప్రస్తుతం ఎక్కడ చూసినా వైరల్‌ టాపిక్‌. జనాలందర్నీ భయపెడుతూ, సినిమా షూటింగులను ఇబ్బంది పెడుతోంది కరోనా. ఆల్రెడీ ఇప్పుడు కరోనా వ్యాప్తి ఉన్న దేశాల్లో ఎప్పుడో ప్లాన్‌ చేసిన కొన్ని సినిమాల షూటింగ్‌లు రద్దయ్యాయి. తాజాగా రజనీకాంత్‌ కొత్త చిత్రం ‘అన్నాత్తే’ కూడా కరోనా ఇబ్బందికి గురైందని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’ (పెద్దన్నయ్య). మీనా, ఖుష్భూ, నయనతార, కీర్తీ సురేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోల్‌కత్తా, పుణే నగరాల్లో జరగాలి. కరోనా కారణంగా ముందు అనుకున్న ప్లాన్‌ని మార్చేసారట. పెద్దన్నయ్యా.. నార్త్‌ వైపు వద్దన్నయ్యా అంటూ ఈ షెడ్యూల్స్‌ను కూడా సౌత్‌లోనే పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారని తమిళనాడు టాక్‌. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement