కష్టాల్లో కళాకారులు..రజనీకాంత్‌ భారీ విరాళం 

Coronavirus: Rajinikanth Donates RS 50 Lakhs To Fill Employees - Sakshi

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వల్ల దినసరి కార్మికుల జీవనశైలి తీవ్రంగా దెబ్బతింటోంది. సినిమా పరిశ్రమలో దినసరి వేతనాలు తీసుకునే చిన్న కార్మికుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. షూటింగులు,  ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు వాయిదా పడడంతో సిని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇలాంటి సందర్భంలో కొంతమంది హీరోలు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
(చదవండి : కరోనా కట్టడికి నితిన్‌ విరాళం)

కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న సినికార్మికులకు రూ. 50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.  ‘ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెప్సీ)’ సంస్థకు రజనీకాంత్ 50 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. హీరో శివకార్తికేయన్‌ రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు అయన తెలిపారు. మిగిలిన రూ.10 లక్షలను సహాయక వస్తువుల రూపేనా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హీరోలు సూర్య, కార్తి కలిపి రూ.10 లక్షలు ఫెప్సికి విరాళంగా ఇచ్చారు. 
(చదవండి : జీతాలను ముందుగానే చెల్లించేశా!)

ఇక టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించడానికి ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనాను ఎదుర్కొవడానికి తనవంతుగా రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. తన సిబ్బందికి మూడు నెలల జీతాన్ని ముందుగానే చెల్లించారు. పేద కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అందించనున్నట్లు హీరో డా.రాజశేఖర్‌-జీవితా రాజశేఖర్‌ ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top