కరోనా కట్టడికి నితిన్‌ విరాళం | Nithin donates Rs 20 lakhs to CM funds to AP And Telangana | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి నితిన్‌ విరాళం

Mar 24 2020 12:28 AM | Updated on Mar 24 2020 2:51 AM

Nithin donates Rs 20 lakhs to CM funds to AP And Telangana - Sakshi

నితిన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తనవంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్‌ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షల చొప్పున మొత్తం 20లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు నితిన్‌. మార్చి 31వ తేదీ వరకు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు  ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో భాగస్వామ్యులు కావాలని నితిన్‌ విజ్ఞప్తి చేశారు.

హిందీకి ‘భీష్మ’
సౌత్‌ కథలెప్పుడూ బాలీవుడ్‌కి కలిసొస్తూనే ఉంటాయి. పోకిరి, మర్యాద రామన్న, అర్జున్‌ రెడ్డి  వంటి తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్‌ అయి, ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం‘జెర్సీ, ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలు రీమేక్‌ అవుతున్నాయి. తాజాగా మరో సౌత్‌ సినిమా ‘భీష్మ’ కూడా ఈ లిస్ట్‌లో చేరనుందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్‌ కెరీర్‌లో భారీ వసూళ్లను సాధించి, పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ రీమేక్‌లో హీరోగా రణ్‌బీర్‌ కపూర్‌ను యాక్ట్‌ చేయించాలని చూస్తున్నారట.

రణ్‌బీర్‌ కపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement