మార్చి 2 నుంచి థియేటర్లు బంద్‌ | Cinema theatres bandh from March 2 | Sakshi
Sakshi News home page

మార్చి 2 నుంచి థియేటర్లు బంద్‌

Feb 28 2018 4:35 PM | Updated on Aug 28 2018 4:32 PM

Cinema theatres bandh from March 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్ : మార్చి 2 నుంచి థియేట‌ర్లలో షోలు నిలిపివేస్తున్నట్లు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రకటించింది. డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌, పంపిణీదారులు, మార్చి 2 నుంచి బంద్‌కు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినిమా అభిమానులు, ప్రేక్షకులు, సహకరించాలని కోరారు.

గతవారం సినిమా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు క్యూబ్‌, యూఎఫ్‌ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మార్చి 2నుంచి  సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు బంద్‌ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2వేల ధియేటర్లు మేర మూత పడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement