‘సిరివెన్నెల’ను కలిసిన చిరు | Chiranjeevi Met Sirivennela Sitarama Shasthri On Occasion Of Getting Padma Sri | Sakshi
Sakshi News home page

Jan 28 2019 7:07 PM | Updated on Jan 28 2019 8:50 PM

Chiranjeevi Met Sirivennela Sitarama Shasthri On Occasion Of Getting Padma Sri - Sakshi

తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం.. అన్నట్టు బిరుదులు, అవార్డుల వెంట సిరివెన్నెల సీతారామశాస్త్రి పరుగెత్తడు.. ఆయన వెనకే అవన్నీ పరుగెత్తుతాయి. మధురమైన పాటలనే కాదు, ఆలోచనలు రేకెత్తె గీతాలను కూడా సృష్టించగలరు. అన్ని రకాల పాటలు ఆయన కలంలోంచి పుట్టాయి. ఎన్నో రాగాలకు పదాలతో ప్రాణాలు పోశారు. ‘సిరివెన్నెల’తో ప్రయాణం మొదలవ్వగా.. నేటి వరకు ఆయన తన పాటలతో అందరినీ అలరిస్తున్నారు.. ఆలోచింపజేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డుని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన్ను సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి సిరివెన్నెలను కలిసి అభినందనలు తెలియజేశారు. వీరిద్దరి కలయికలో ఎన్నో మంచి గీతాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పలు వేదికలపై సిరివెన్నెల ప్రస్థావించిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు శివాజీ రాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌లాంటి ప్రముఖులు సిరివెన్నెలను కలిసి తమ అభినందనలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement