పెద్దలకు మాత్రమే! | Cheekati Gadhilo chithakkottudu trailer released | Sakshi
Sakshi News home page

పెద్దలకు మాత్రమే!

Feb 4 2019 2:34 AM | Updated on Feb 4 2019 2:34 AM

Cheekati Gadhilo chithakkottudu trailer released - Sakshi

నిక్కీ తంబోలీ, అరుణ్‌ ఆదిత్‌

అరుణ్‌ ఆదిత్, నిక్కీ తంబోలీ జంటగా సంతోష్‌ పి.జయకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. బ్లూ గోస్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో ఆదిత్‌ మాట్లాడుతూ– ‘‘కామెడీతో సాగే హారర్‌ చిత్రమిది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలుంటాయి. ఇంతకు ముందు నేనే నటించిన ‘ఎల్‌ 7’ అనే హారర్‌ మూవీ సరిగ్గా ఆడలేదు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘దక్షిణాదిలో ఈ జోనర్‌ కొత్త. నేను తమిళంలో తెరకెక్కించిన చిత్రాన్ని ఇక్కడ రీమేక్‌ చేశాను. 18 ఏళ్లు దాటిన వాళ్లే ఈ సినిమా చూడండి. ఇది బూతు చిత్రం కాదు. మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. భయపెడుతూనే నవ్విస్తాం’’ అన్నారు  సంతోష్‌ పి.జయకుమార్‌. ‘‘ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అని కథానాయిక నిక్కీ తంబోలీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement