హనీమూన్‌కు నెదర్లాండ్స్‌ వెళ్లాం | Chandan Shetty Gives Clarity On His Honeymoon Trip | Sakshi
Sakshi News home page

హనీమూన్‌కు నెదర్లాండ్స్‌ వెళ్లాం

Mar 15 2020 8:33 AM | Updated on Mar 15 2020 8:42 PM

Chandan Shetty Gives Clarity On His Honeymoon Trip - Sakshi

సాక్షి, మండ్య: హనీమూన్‌కు ‘మేము వెళ్లింది ఇటలీ కాదు.. నెదర్లాండ్‌కు’ అని నటుడు చందన్‌ శెట్టి తెలిపారు. తాము హనీమూన్‌కు ఇటలీ వెళ్లినట్లు అబద్ధపు వార్తలు సృష్టించారని ఆయన శనివారం తెలిపారు. కాగా, ఇటీవల నివేదితా, చందన్‌ శెట్టిల వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం హనీమూన్‌కు వెళ్లారు. అయితే నూతన వధూవరులు ఇటలీకి హనీమూన్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో మండ్యలో వారిరువురు మీడియాతో మాట్లాడుతూ... ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి వెళ్లిన విషయం అధికారుల వద్ద ఉందని చెప్పారు. తాము ఈ నెల 3న నెదర్లాండ్స్‌కు వెళ్లినట్లు, అప్పుడు అక్కడ కరోనా వైరస్‌ భయం లేదని తెలిపారు. ప్రస్తుతం తామిరువురం ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. రక్తపరీక్షలతో పాటు అన్ని వైద్య పరీక్షలు చేశారని తెలిపారు. కరోనా వెళ్లిపోయాక మళ్లీ హనీమూన్‌కు వెళ్తామని చెప్పారు. చదవండి: కరోనాతో హనీమూన్‌ రద్దు!

నివేదితను పెళ్లాడిన చందన్‌ శెట్టి

Advertisement
 
Advertisement
Advertisement