విలన్‌ రోల్‌లో ఛమ్మక్‌ చంద్ర

Chammak Chandra as villain in Seyal - Sakshi

తెలుగు ప్రేక్షకులకు జబర్థస్త్ షోతో హాస్యనటుడిగా పరిచయం అయిన ఛమ్మక్ చంద్ర పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో ఇంత వరకు కనిపించలేదు చంద్ర. తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ దక్కకపోయినా.. కోలీవుడ్ ఇండస్ట్రీ ఆ అవకాశం ఇచ్చింది. త్వరలో ఓ తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కామెడీ స్టార్.

సెయల్ పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చంద్ర విలన్ రోల్ లో కనిపించనున్నాడు. రవి అబ్బులు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద‍్ధార్థ్ విపిన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను సీఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై సీఆర్ రాజన్ నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top