‘ఛల్‌ మోహన్‌ రంగ’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ | Chal Mohan Ranga first single on feb 24 | Sakshi
Sakshi News home page

Feb 21 2018 1:23 PM | Updated on Mar 22 2019 5:33 PM

Nithin in Chal Mohan Ranga - Sakshi

ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలో నితిన్‌

యంగ్ హీరో నితిన్ సిల్వర్ జూబ్లీ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ఛల్‌ మోహన్‌ రంగ. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ టీజర్‌ ను రిలీజ్ చేశారు. 

తాజాగా తొలి పాట రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నారు. ఇష్క్‌ ను సక్సెస్‌ ట్రాక్‌ లోకి తీసుకువచ్చిన ఇష్క్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ రోజునే ఛల్ మోహన్‌ రంగ తొలి పాట రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు నితిన్‌. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement