Majili Teaser | Naga Chaitanya, Samantha - వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు - Sakshi
Sakshi News home page

మజిలీ టీజర్‌: స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం

Feb 14 2019 10:23 AM | Updated on Feb 14 2019 12:32 PM

Chaitanya And Samanthas Majili Teaser Released  - Sakshi

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్‌ లైఫ్‌ జోడి సమంతతో కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ‘దేర్‌ ఈజ్‌ లవ్‌.. దేర్‌ ఈజ్‌ పెయిన్‌’ అనేది ఉపశీర్షిక. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఇందులో నీకో సంవ‌త్స‌రం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం. ఒక్కసారి పోతే తిరిగి రావు అది వస్తువైనా, అమ్మాయైనా అని రావు ర‌మేష్ చెప్పే డైలాగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. చివర్లో వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరకుకుతారంటూ పోసాని చెప్పే డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఇక చిత్రంలో ప‌లు స‌న్నివేశాలు కూడా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ. వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. (ప్రేమ ఉంది.. బాధ ఉంది)

సమంత, చైతన్యల వివాహానంతరం  కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కావడం, అందులోను ఇద్దరూ భార్యాభర్తలుగానే నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.  (ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్‌లో ప్రియురాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement