ప్రేమ ఉంది.. బాధ ఉంది

Chaitanya and Samantha's Majili first look released - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘నిన్నుకోరి’ లాంటి ఎమోషనల్‌ సినిమాతో హిట్‌ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ‘దేర్‌ ఈజ్‌ లవ్‌.. దేర్‌ ఈజ్‌ పెయిన్‌’ అన్నది ఉపశీర్షిక. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ని  రిలీజ్‌ చేశారు. ‘మజిలీ’ ఫస్ట్‌ లుక్‌లో చైతన్య, సమంత ఒకరినొకరు ఆప్యాయంగా పట్టుకుని ఉండటం చాలా ఎమోషనల్‌గా ఉంది. పైగా వారి లుక్‌ ఇందులో చాలా కొత్తగా ఉంది. చై, సామ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్, విశాఖపట్నం అని బోర్డుపై రాసుంది. వైజాగ్‌ నేపథ్యంలో రొమాంటిక్‌ ఎంటరై్టనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ‘ఏమాయ చేసావె, మనం, ఆటోనగర్‌ సూర్య’ చిత్రాల తర్వాత, వివాహానంతరం సమంత, నాగచైతన్య నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో మంచి అంచనాలున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top