రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

Car Accident Hollywood  Actor and comedian Hero Kevin Hart Hospitalized  - Sakshi

ప్రముఖ హాలీవుడ్ హీరో, హాస్యనటుడు కెవిన్ హార్ట్‌‌(40) ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ముల్హోల్యాండ్ రహదారిపై కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున  ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కెవిన్‌కు తీవ్ర గాయాలు కాగా, అతని స్నేహితులు బ్లాక్, ఇంటర్నెట్ ఫిట్నెస్ మోడల్ ,బ్లాక్‌  ఫియాన్సీ రెబెక్కా కూడా తీవ్రంగా గాయపడ్డారు. వేరే వేరు ఆసుపత్రుల్లో చికిత్స  పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. 

వాహనాన్ని నడుపుతున్న జేర్డ్‌ బ్యాక్‌(28) బ్లాక్‌ నియంత్రణ కోల్పోవడంతో  వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి పక్కనే వున్న గోతిలోకి పడిపోయింది. దీంతో కెవిన్‌తోపాటు, బ్లాక్‌కు నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు హెలికాఫ్టర్ ద్వారా..హాస్పిటల్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీనిపరిశీలించిన అధికారులు ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కాగా ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్‌ మూవీలో జుమాన్జీ పాత్రలో కెవిన్‌ మెప్పించారు.  2019 ఆస్కార్‌ పండుగకు కెవిన్‌ హోస్ట్‌గా వ్యవహరించాల్సి వుంది  కానీ స్వలింగ సంపర్కానికి సంబంధించిన ఆయన పాత  ట్వీట్లు వెలుగులోకి రావడంతో ఆయన్ను తప్పించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top