రహస్యంగా షాపింగ్! | Brad Pitt, Angelina Jolie, their kids go on shopping spree at Target | Sakshi
Sakshi News home page

రహస్యంగా షాపింగ్!

Dec 25 2013 11:35 PM | Updated on Sep 2 2018 4:03 PM

రహస్యంగా షాపింగ్! - Sakshi

రహస్యంగా షాపింగ్!

ఆస్ట్రేలియాలో అదో ప్రఖ్యాత షోరూమ్. ఉదయం కరెక్ట్ టైమ్‌కి దుకాణం తెరవడం, రాత్రి ఠంచనుగా మూసేయడం వారి అలవాటు. దుకాణం మూసే టైమ్ అయ్యిందంటే చాలు

ఆస్ట్రేలియాలో అదో ప్రఖ్యాత షోరూమ్. ఉదయం కరెక్ట్ టైమ్‌కి దుకాణం తెరవడం, రాత్రి ఠంచనుగా మూసేయడం వారి అలవాటు. దుకాణం మూసే టైమ్ అయ్యిందంటే చాలు.. కస్టమర్లు అక్కణ్ణుంచి సర్దుకోవాల్సిందే. అంత స్ట్రిక్ట్. కానీ, హాలీవుడ్ భామ ఏంజెలినా జోలీ కోసం తమ నియమాలను మార్చుకున్నారు ఆ షోరూమ్ యజమానులు. తన భర్త, ఆరుగురు పిల్లలతో కలిసి ఏంజెలినా అక్కడ షాపింగ్ చేయాలనుకున్నారు. అయితే, షోరూమ్ రద్దీగా ఉన్న సమయంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఎవరూ లేనప్పుడు వెళ్లాలనుకున్నారు. 
 
 అందుకని, రాత్రి దుకాణం మూసే టైమ్ అయ్యాక తమకోసం తెరచి ఉంచమని కోరారు. హాలీవుడ్ ఏంజిల్ అడిగితే కాదంటారా? రాత్రి ఏడున్నరకల్లా కస్టమర్స్ అందర్నీ పంపించేసి, జోలీకి ఫోన్ కొట్టారట. ఆ తర్వాత తాపీగా తన కుటుంబంతో సహా వచ్చి, హ్యాపీగా షాపింగ్ చేసుకున్నారట జోలీ. అరగంటలో తమకు కావల్సినవన్నీ కొనుక్కున్నారని, జోలీ షాపింగ్ చేయడంలో కూడా ఓ అందం ఉందని, చూడటానికి రెండు కళ్లూ చాలలేదని ఆ షాప్‌కి చెందిన సేల్స్‌మేన్ మీడియాలో తనకు తెలిసినవాళ్లకి చెప్పాడు. దాంతో ఎవరికీ తెలియకుండా జోలీ చేసిన షాపింగ్ అందరికీ తెలిసిపోయింది. ఆ సమయంలో షాప్ బయట ఉండి ఉంటే తమ కలల సుందరిని చూసే అవకాశం దక్కేదని జోలీ అభిమానులు ఫీలైపోతున్నారట. 
 

Advertisement
 
Advertisement
Advertisement