హిట్ అండ్ రన్ కేసు ఫైల్.. | Bollywood hero salman khan hit and run case file details | Sakshi
Sakshi News home page

హిట్ అండ్ రన్ కేసు ఫైల్..

May 7 2015 1:07 AM | Updated on Apr 3 2019 6:23 PM

హిట్ అండ్ రన్ కేసు ఫైల్.. - Sakshi

హిట్ అండ్ రన్ కేసు ఫైల్..

2002, సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ నుంచి బయల్దేరిన సల్మాన్ కారు(తెల్లరంగు టయోటా ల్యాండ్ క్రూయిజర్) బాంద్రాలోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీలోకి దూసుకువెళ్లింది.

  •  2002, సెప్టెంబర్ 28    అర్ధరాత్రి ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ నుంచి బయల్దేరిన సల్మాన్  కారు(తెల్లరంగు టయోటా ల్యాండ్ క్రూయిజర్) బాంద్రాలోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీలోకి దూసుకువెళ్లింది. దాని ముందు పేవ్‌మెంట్‌పై పడుకున్నవారిపై నుంచి కారు వెళ్లడంతో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
  •  సెప్టెంబర్ 28    సల్మాన్ రక్త నమూనాల సేకరణ, అరెస్ట్, బెయిల్
  •  అక్టోబర్ 1    ఐపీసీలోని పలు సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం 1998, బాంబే ప్రొహిబిషన్ చట్టం-1949 కింద కేసులు. ఇదే నెలలో పదేళ్ల జైలుశిక్ష విధించే వీలున్న ఐపీసీలోని 304-2 సెక్షన్ (ఉద్దేశపూర్వకంకాని హత్య) కింద కేసు నమోదు.
  •  అక్టోబర్ 7    పోలీసుల ముందు సల్మాన్ లొంగుబాటు, అరెస్ట్
  •  అక్టోబర్ 21    బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసుల చార్జిషీట్
  •  అక్టోబర్ 24    బెయిల్ మంజూరు
  •  2003, మార్చి    తనపై ఐపీసీ సెక్షన్ 304-2 ప్రయోగించడాన్ని సెషన్స్ కోర్టులో సవాలు చేసిన సల్మాన్
  •  మే    అప్పీలును కొట్టివేసిన కోర్టు. అభియోగాలు నమోదు చేయాలని మేజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశం
  •  జూన్    బాంబే హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్. సెక్షన్ 304-2 ప్రయోగం సరికాదని కోర్టు అభిప్రాయం
  •  అక్టోబర్    బాంబే హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
  •  డిసెంబర్    సెక్షన్ 304-2 వర్తింపుపై మేజిస్ట్రేట్ కోర్టే నిర్ణయం తీసుకుంటుందన్న సుప్రీం
  •  2006, అక్టోబర్    సల్మాన్‌పై అభియోగాలను నమోదు చేసిన మేజిస్ట్రేట్
  •  2007, అక్టోబర్ 3    కేసులో మొదటి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన పోలీస్ బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ క్షయ వ్యాధితో మృతి
  •  2011, అక్టోబర్    కఠిన సెక్షన్ల కింద విచారించాలన్న ప్రాసిక్యూషన్
  •  2013, డిసెంబర్ 23    సల్మాన్‌పై సెక్షన్ 304-2 ప్రయోగం సరైందేనని స్పష్టంచేసిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, కేసు విచారణ సెషన్స్ కోర్టుకు బదలాయింపు
  •  2014, ఏప్రిల్ 27    సెషన్స్ కోర్టులో మళ్లీ వాదనలు ప్రారంభం
  •  జూలై 24    అభియోగాల నమోదు. ఈ నెలలో బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైళ్లు మాయం. 63 మంది సాక్షుల వాంగ్మూలాలు అదృశ్యం. విచారణకు కోర్టు ఆదేశం
  •  సెప్టెంబర్ 12    ఫైళ్ల ఆచూకీ లభ్యం. కోర్టుకు అందజేత.
  •  2015, మార్చి 27    అదనపు సెషన్స్ జడ్జి డీడబ్ల్యూ దేశ్‌పాండే సమక్షంలో సల్మాన్ వాంగ్మూలం నమోదు
  •  మార్చి 31     పమాదం సమయంలో తానే కారు నడుపుతున్నానని కోర్టుకు తెలిపిన సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్
  •  ఏప్రిల్ 1    వాదనలు ప్రారంభించిన ప్రాసిక్యూషన్
  •  ఏప్రిల్ 10    సల్మాన్ న్యాయవాది వాదనలు ప్రారంభం
  •  ఏప్రిల్ 20    ముగిసిన వాదనలు
  •  ఏప్రిల్ 21    మే 6న తీర్పు వెలువరిస్తామన్న కోర్టు
  •  మే 6    సల్మాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు. ఐదేళ్ల జైలు శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement