దర్శక–నిర్మాత హరీశ్‌ షా కన్నుమూత | Bollywood Director-producer Harish Shah passed away | Sakshi
Sakshi News home page

దర్శక–నిర్మాత హరీశ్‌ షా కన్నుమూత

Jul 9 2020 2:09 AM | Updated on Jul 9 2020 2:09 AM

Bollywood Director-producer Harish Shah passed away - Sakshi

హరీశ్‌ షా

బాలీవుడ్‌ దర్శక–నిర్మాత హరీశ్‌ షా (76) ముంబైలో కన్నుమూశారు. పదేళ్లుగా హరీశ్‌ గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ఆయన సోదరుడు వినోద్‌ షా తెలిపారు. రాజేశ్‌ ఖన్నా హీరోగా ‘మేరే జీవన్‌ సాథీ’, ‘రామ్‌ తేరీ కిత్‌నే నామ్‌’ తదితర చిత్రాలను నిర్మించారు హరీశ్‌. నిర్మాతగా ఆయన చివరి చిత్రం ‘జాల్‌: ది ట్రాప్‌’ 2003లో విడుదలైంది. ఆ చిత్రంలో సన్నీ డియోల్, టబు, రీమాసేన్‌ నటించారు. అలాగే ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హా హీరోలుగా ‘జల్‌జల’, రిషీ కపూర్, నీతూ సింగ్‌ జంటగా ‘ధన్‌ దౌలత్‌’తో పాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. హరీశ్‌ షా మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement