సింహా ఇన్‌ సేతుపతి ఔట్‌? | Bobby Simha in Allu Arjun Next In Pushpa Movie | Sakshi
Sakshi News home page

సింహా ఇన్‌ సేతుపతి ఔట్‌?

Apr 28 2020 12:28 AM | Updated on Apr 28 2020 12:28 AM

Bobby Simha in Allu Arjun  Next In Pushpa Movie - Sakshi

బాబీ సింహా

అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్లో ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత రానున్న చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక. ప్యాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తారు అల్లు అర్జున్‌. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, హిందీ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలు చేస్తారనే వార్త వచ్చింది. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపిస్తారని కూడా వినిపించింది. అయితే విజయ్‌ సేతుపతి స్థానంలో తమిళ నటుడు బాబీ సింహా కనిపించనున్నారన్నది తాజా టాక్‌. ‘పుష్ప’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement