బిపాసా... గోగోగో.. గోవా | Bipasha Basu to celebrate Karan Singh birthday in Goa | Sakshi
Sakshi News home page

బిపాసా... గోగోగో.. గోవా

Feb 22 2015 7:28 PM | Updated on Sep 2 2017 9:44 PM

బాలీవుడ్ హాట్ బ్యూటీ గర్ల్ బిపాసబసు తన బాయ్ఫ్రెండ్ కరన్ సింగ్ గ్రోవర్తో కలిసి గోవా బీచుల్లో షికార్ల కోసం వెళ్లిందట.

బాలీవుడ్ హాట్ బ్యూటీ గర్ల్ బిపాసబసు తన బాయ్ఫ్రెండ్ కరన్ సింగ్ గ్రోవర్తో కలిసి గోవా బీచుల్లో షికార్ల కోసం వెళ్లిందట. ఇటీవల ఈ జంట బాగా సన్నిహితంగా ఉంటున్నారని బాలీవుడ్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తన రెండో భార్యతో విడిపోయిన కరన్ సింగ్  ఈ ఫిబ్రవరి 23న  పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నాడు. అయితే, బిపాస అతను కలిసి ఈ మధ్య ఎలోన్ అనే హిందీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

 

వీరిద్దరి మధ్య ఈ సినిమాలో చాలా చక్కగా కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని కొందరు దర్శకులు కితాబిచ్చారట. ఫలితంగా వారిద్దరి మధ్య చనువు అతిగా పెరిగిందంటున్నారు కొందరు. దీంతో గోవా బీచుల్లో అర్థరాత్రి కరన్తో కేక్ కట్ చేయించేందుకు తన స్నేహితులు డిజైనర్ రాకీ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డియానే పాండే, మరో మోడల్ క్యాండిస్ పింటోతో కలిసి రయ్మని దూసుకెళ్లే కారులో రోడ్డు వెంట బీచులో షికారుకెళ్లిందట.. గతంలో ఈ అమ్మడు జాన్ అబ్రహాం, హార్మన్ భవేజాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement