నాపై అత్యాచారయత్నం జరిగింది: బిగ్‌బాస్‌ నటి

Bigg Boss 13 Hindi: Arti Singh Reveals She Faced Rape Attempt - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 13 సెంచరీ ఎపిసోడ్లను పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘ఛపాక్‌’ బృందం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌తో పాటు హీరోయిన్‌ దీపిక పదుకొనే, హీరో విక్రాంత్‌ మాస్సే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటిసభ్యులతో కలిసి సందడి చేసిన ఛపాక్‌ బృందం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు వారి జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటనలను పంచుకోవాలని కోరారు. దీంతో ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వారికి జరిగిన సంఘటనలను చెప్తూ విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆర్తి సింగ్‌ తనకు చిన్నవయసులో జరిగిన భయంకర అనుభవాన్ని పంచుకుంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. ఆ రోజు నేను ఇంట్లో మధ్యాహ్నం మూడింటికి నిద్రపోతున్న సమయంలో మా ఇంట్లో పని చేసే వ్యక్తి నాపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయి నేను ఏడ్చాను, అరిచాను, అతని బట్టలను చింపాను, బయటివాళ్ల సహాయం కోసం గొంతు చించుకుని అరిచాను. అతను భయపడిపోయి రెండో అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అలా నన్ను నేను కాపాడుకున్నాను. కానీ ఈ ఘటన తర్వాత నేను చాలా కుంగిపోయాను. నన్ను నేను అసహ్యించుకున్నాను.

అలాంటి మానసిక స్థితి నుంచి బయటపడేయడానికి నా తల్లి, సోదరుడు ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు కూడా దీని గురించి మాట్లాడుతుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఇప్పటికీ ఒంటరిగా నిద్రించాలంటేనే వెన్నులో వణుకు పడుతుంది. అందుకే భయంతో నా గది తెలుపులు తెరుచుకునే నిద్రిస్తాను’ అని ఆమె పేర్కొంది. అయితే తనకు జరిగిన చేదు ఘటన గురించి సరైన వేదికపైనే మాట్లాడాలనుకున్నానని ఆర్తి సింగ్‌ తెలిపింది. దానివల్ల తాను చెప్పాలనుకున్న విషయం ఎక్కువ మంది మహిళలకు చేరుతుందని చెప్పుకొచ్చింది. కాగా మహిళలు తమపై జరిగే దాడులపై తప్పనిసరిగా నోరు విప్పాలని కోరింది. కనీసం తల్లిదండ్రులతోనైనా చెప్పుకోవాలని సూచించింది. ఇక మిగతా కంటెస్టెంట్లు సైతం తాము ఎదుర్కొన్న ఘటనల గురించి చెప్తూ కన్నీటిమయమయ్యారు.

చదవండి:
ఘనంగా బిగ్‌బాస్‌ నటి వివాహం
చీరకట్టులోనే యాక్షన్‌ ఫీట్‌కు సై అన్న బిగ్‌బాస్‌ భామ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top