నిన్ను చూసి గర్విస్తున్నా: నటి భర్త

Nazar Actress Monalisa Doing Action Sequence In Saree - Sakshi

సినిమావాళ్లు మాత్రమే యాక్షన్‌ సీన్స్‌, సాహస ఫీట్లు చేస్తారనుకుంటారు చాలామంది. కానీ, వారికి ఏ మాత్రం తీసిపోకుండా బుల్లితెర మీద వస్తున్న యాక్షన్‌ సీన్లకు కొదవే లేదు. పలు సీరియల్స్‌, షోలలో సినీ నటులను మించి మరీ బుల్లితెర యాక్టర్లు సాహసాలకు పూనుకుంటున్నారు. దీనికి బుల్లితెర నటి మోనాలిసాను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ భామ ‘నజర్‌’ అనే సీరియల్‌లో దయాన్‌ అనే నెగెటివ్‌ పాత్రను పోషిస్తోంది. ఇందులో ఆమెకు అశేష శక్తులు ఉంటాయి. పాత్రకు అనుగుణంగా ఆమె ఓ సాహస ఫీట్‌ చేయాల్సి వచ్చింది. దీనికి క్షణం కూడా ఆలోచించకుండా సరేనంటూ చీరకట్టులోనే యాక్షన్‌ సీన్‌కు రెడీ అయింది. అందులో భాగంగా తాడును పట్టుకుని పైకి ఎక్కుతూ చివరగా చెట్టు కొమ్మపై నిల్చుంది.

ఇప్పుడు అసలైన యాక్షన్‌ సీన్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను మోనాలిసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.  దీనికి ఆమె భర్త విక్రాంత్‌ సింగ్‌ ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మోనాలిసా పని పట్ల చూపిస్తున్న అంకితభావానికి ముగ్ధులైన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో బిగ్‌బాస్‌ 10లో తళుక్కున మెరిసిన మోనాలిసా ఈ ఒక్క షోతో  కావాల్సినంత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కనిపించింది. 2016లో ప్రియుడు విక్రాంత్‌ సింగ్‌ను వివాహం చేసుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top