బ్యాంగ్‌ బ్యాంగ్‌ | Bhumika's Re-entry To Tollywood | Sakshi
Sakshi News home page

బ్యాంగ్‌ బ్యాంగ్‌

Dec 24 2017 12:53 AM | Updated on Dec 24 2017 8:24 AM

Bhumika's Re-entry To Tollywood - Sakshi

భూమిక చివరిసారిగా తెలుగు స్క్రీన్‌పై కనిపించింది ఎప్పుడు? ఓ మూడేళ్లు అయ్యుంటుంది. ఈ ఏడాది ‘ఎంసీఏ’  (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి)తో తెలుగుకి మళ్లీ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె హీరో నానికి వదినగా నటించి, మంచి మార్కులే కొట్టేశారు. కమ్‌బ్యాక్‌ అంటే.. ఇలా బ్యాంగ్‌ బ్యాంగ్‌గా ఉండాలన్నట్టు ఈ చిత్రంలో భూమిక మెప్పించారు. నెక్ట్స్‌ ఏంటి? మళ్లీ కనిపిస్తారా? గ్యాప్‌ తీసుకుంటారా? అంటే.. చాన్సే లేదు. ఇక వరుసగా సినిమాలు చేసేలా ఉన్నారు. ఎందుకంటే, ‘ఎంసీఏ’ ఇలా రిలీజైందో లేదో భూమిక మరో సినిమాతో బిజీ అయ్యారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు భూమిక. దీన్నిబట్టి చూస్తుంటే ఈ బ్యూటీ తన కెరీర్‌ మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టారనిపిస్తోంది. సో.. భూమిక యూత్‌ హీరోలందరికీ అక్క, వదినగా, అవి కాకపోతే కథ డిమాండ్‌ని బట్టి కథానాయికగా కూడా కనిపించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement