తొలిరోజు రికార్డు కలెక్షన్లు | Bharat Box Office Collection Day 1 | Sakshi
Sakshi News home page

తొలిరోజు రికార్డు కలెక్షన్లు

Jun 6 2019 2:34 PM | Updated on Jun 6 2019 2:37 PM

Bharat Box Office Collection Day 1 - Sakshi

భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఉన్నప్పటికీ సల్మాన్‌ చిత్రానికి వసూళ్ల వర్షం కురవడం విశేషం.

ముంబై: బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి నిరూపించాడు. అతడి తాజా చిత్రం ‘భారత్‌’  భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. సల్మాన్‌ఖాన్‌కు రంజాన్‌ సెంటిమెంట్‌ మరోసారి వర్క్‌వుటయింది. భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఉన్నప్పటికీ సల్మాన్‌ చిత్రానికి వసూళ్ల వర్షం కురవడం విశేషం. (చదవండి: వర్మకి ఆగ్‌.. అలీ అబ్బాస్‌కు ‘భారత్‌’!)

సల్మాన్‌ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘భారత్‌’ రికార్డు సాధించింది. అంతేకాదు రంజాన్‌ రోజున విడుదలైన సల్మాన్‌ సినిమాల్లో టాప్‌ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బుధవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ.42.30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 2016లో రంజాన్‌ రోజున విడుదలైన సుల్తాన్‌ సినిమా ఒక్కరోజు కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. సుల్తాన్‌ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన టూబ్‌లైట్‌, రేస్‌ 3 సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఒక్క 2013లో మినహా 2010 నుంచి ఇప్పటివరకు ప్రతి రంజాన్‌కు సల్మాన్‌ఖాన్‌ విడుదలయ్యాయి. ‘భారత్‌’ కు అత్యధిక ఓపెనింగ్‌ వసూళ్లు అందించినందుకు అభిమానులకు ట్విటర్‌ ద్వారా సల్మాన్‌ఖాన్‌ ధన్యవాదాలు తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement