‘భరత్‌ అనే నేను’.. మేకింగ్‌ వీడియో వైరల్‌ | Bharat Ane Nenu Making Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘భరత్‌ అనే నేను’.. మేకింగ్‌ వీడియో వైరల్‌

Apr 8 2018 6:47 PM | Updated on Apr 8 2018 6:50 PM

Bharat Ane Nenu Making Video Viral On Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు లేటెస్ట్‌ మూవీ ‘భరత్‌ అనే నేను’.. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో సినిమాలు తీసే కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మూవీకి సంబంధించిన మేకింగ్‌ వీడియోను నిర్మాత డీవీవీ దానయ్యకు చెందిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. మహేశ్‌ ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ మూవీ మేకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 1నిమిషం 53 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మూవీని ఎలాంటి వాతావరణంలో రూపొందిచ్చారన్నది తెలుస్తోంది.

శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్‌ అనే నేను’. బహిరంగ సభ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరో మహేశ్‌ బాబు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, నటి కియారా అద్వాని, నటుడు ప్రకాశ్‌ రాజ్‌, తదితరులు హాజరు కావడంతో సందడిగా ఈవెంట్‌ జరిగింది. డీవీవీ దానయ్య మూవీని నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement