భానుచందర్ కొడుకు బంగారం | Bhanu Chander to direct his son Jayanth in 'Naa Koduku Bangaram' | Sakshi
Sakshi News home page

భానుచందర్ కొడుకు బంగారం

Sep 24 2013 2:19 AM | Updated on Aug 28 2018 4:30 PM

భానుచందర్ కొడుకు బంగారం - Sakshi

భానుచందర్ కొడుకు బంగారం

తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత.

తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత. 
 
 వచ్చే నెలలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రం గురించి భానుచందర్ మాట్లాడుతూ- ‘‘టైటిల్‌కి తగ్గట్టుగా కథ ఉంటుంది. థ్రిల్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ కలగలిసిన కథ ఇది. నా చిరకాల మిత్రుడు బూచితో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. 
 
 అక్టోబర్ చివరివారంలో ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుంది’’ అని తెలిపారు. సుమన్, సుహాసినీ మణిరత్నం, బ్రహ్మానందం, నాజర్, సీత, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ముఖేష్‌రుషి తదితరులు ఇందులో ఇతర పాత్రలు పోషించనున్నారు.
 
Advertisement
 
Advertisement
Advertisement