బాలయ్య సినిమాకు భారీగా కోత | Balakrishna Boyapati Srinu Movie Latest Update | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాకు భారీగా కోత

May 4 2019 12:58 PM | Updated on May 4 2019 12:58 PM

Balakrishna Boyapati Srinu Movie Latest Update - Sakshi

ఎన్టీఆర్ బయోపిక్‌తో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ, త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చిన బాలయ్య త్వరలోనే ఈసినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్‌ హిట్ కావటంతో హ్యాట్రిక్‌ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావించారు.

అయితే ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలు రిలీజ్‌ అయిన తరువాత సీన్‌ పూర్తిగా మారిపోయింది. రెండు భాగాలు డిజాస్టర్‌ కావటం, అదే సమయంలో బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామకు కూడా బ్యాడ్‌ టాక్‌ రావటంతో బాలయ్య సినిమా విషయంలో ఆలోచనలో పడ్డారు. ముందుగా 60 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలని భావించినా.. ఇప్పుడు అంత బడ్జెట్‌ వర్క్‌అవుట్ కాదేమో అన్న భావనలో ఉన్నారట. అందుకే బడ్జెట్‌లో భారీగా కోత పెట్టినట్టుగా తెలుస్తోంది. 40 కోట్ల లోపే సినిమాను పూర్తి చేసేందుకు స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మార్పులు ఎంత వరకు వర్క్‌ అవుట్ అవుతాయో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement