ఇది నా పూర్వజన్మ సుకృతం : బాలయ్య | Bala krishna on Gautamiputra Satakarni | Sakshi
Sakshi News home page

ఇది నా పూర్వజన్మ సుకృతం : బాలయ్య

Jan 12 2017 1:43 PM | Updated on Sep 5 2017 1:06 AM

ఇది నా పూర్వజన్మ సుకృతం : బాలయ్య

ఇది నా పూర్వజన్మ సుకృతం : బాలయ్య

ఈ రోజు(గురువారం) విడుదలైన గౌతమిపుత్రశాతకర్ణి సినిమాను బాలకృష్ణ అభిమానులతో కలిసి చూశారు. రాత్రి భ్రమరాంబ థియేటర్లో ఏర్సాటు చేసిన బెనిఫిట్ షోకు హాజరైన బాలయ్య ఉదయాన్నే

ఈ రోజు(గురువారం) విడుదలైన గౌతమిపుత్రశాతకర్ణి సినిమాను బాలకృష్ణ అభిమానులతో కలిసి చూశారు. రాత్రి భ్రమరాంబ థియేటర్లో ఏర్సాటు చేసిన బెనిఫిట్ షోకు హాజరైన బాలయ్య ఉదయాన్నే ప్రసాద్ ఐమాక్స్ లో సందడి చేశాడు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియలతో ఐమాక్స్ కు వచ్చిన బాలకృష్ణ ఘనవిజయాన్ని అంధించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన బాలకృష్ణ.. ఈ విజయం తెలుగుజాతి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. నాన్నగారు చేయాలనుకున్న సినిమాలో తాను నటించటం తన పూర్వజన్మ సుకృతం అన్న బాలయ్య, ఈ విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందని.. ఇక పై కూడా అభిమానులను అలరించే సినిమాలను అందిస్తానని తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement