ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు నిరాశేనా..? | Bad News About Aravinda Sametha For Jr NTR Fans | Sakshi
Sakshi News home page

Sep 18 2018 10:13 AM | Updated on Sep 18 2018 10:13 AM

Bad News About Aravinda Sametha For Jr NTR Fans - Sakshi

వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తారక్‌ అభిమానులకు షాక్‌ ఇస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ చూసే అవకాశం అభిమానులకు లేదన్న ప్రచారం జరుగుతోంది. రిలీజ్‌కు మరింత సమయం లేకపోవటంతో విదేశాల్లో చిత్రీకరించాలనుకున్న ఓ పాటను తొలిగించినట్టుగా తెలుస్తోంది. దీంతో సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉండనున్నాయి. వాటిలో ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్, మరొకటి ఇటీవల రిలీజ్‌ అయిన రొమాటింక్ సాంగ్‌ కావటంతో వాటిలో ఎన్టీఆర్‌ డ్యాన్సులు చూసే అవకాశం లేదు.

ఎన్టీఆర్‌ సోలో సాంగ్ ఫ్యాన్స్‌ను కాస్త అలరించినా మరో పాటు కూడా మెలోడీనే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో తారక్‌ డ్యాన్స్‌లు చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశే అన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను అక్టోబర్‌ 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement