బాహుబలి నిర్మాతల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..? | Baahubali Producers Next Film With young hero | Sakshi
Sakshi News home page

బాహుబలి నిర్మాతల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..?

Mar 4 2017 12:42 PM | Updated on Sep 5 2017 5:12 AM

బాహుబలి నిర్మాతల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..?

బాహుబలి నిర్మాతల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..?

ఆర్కా మీడియా.. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన నిర్మాణ సంస్థ. కేవలం ఐదు సినిమాలు

ఆర్కా మీడియా.. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన నిర్మాణ సంస్థ. కేవలం ఐదు సినిమాలు చేసిన అనుభవంతోనే బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను తెరకెక్కించారు. కథ మీద నమ్మకంతో వంద కోట్లతో ఓ రీజినల్ సినిమాను రూపొందించిన ఈ నిర్మాతలు బాహుబలి తరువాత ఎలాంటి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే బాహుబలి 2 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్ పనులు కూడా మొదలు పెట్టారు.

ఏప్రిల్ 28న బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఆ తరువాత మరో నెల రోజుల పాటు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండనుంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన బాహుబలి నిర్మాతల నెక్ట్స్ సినిమా ఏంటి..? మరోసారి ఇలాంటి భారీ చిత్రాన్నే రూపొందిస్తారా..? లేక రెగ్యులర్ సినిమా చేస్తారా..? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు సినిమా అభిమానులతో పాటు సినీ వర్గాల మదిలోనూ మెదులుతుంది.

అయితే బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత ఓ మీడియం రేంజ్ సినిమాను ప్లాన్ చేస్తోంది ఆర్కా మీడియా సంస్థ. యంగ్ హీరో శర్వానంద్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ రావు దర్శకత్వంలో సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మార్నింగ్ రాగా లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాతో ఆకట్టుకున్న ప్రకాష్, శర్వానంద్ హీరోగా ఎలాంటి సినిమా చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఆర్కా మీడియా తదుపరి చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement