క్వీన్‌ కోసం ‘అ’ దర్శకుడు | Awe Fame Prasanth Varma To Helm Queen Remake | Sakshi
Sakshi News home page

May 29 2018 12:57 PM | Updated on May 29 2018 4:22 PM

Awe Fame Prasanth Varma To Helm Queen Remake - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ హిట్ క్వీన్‌ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  భాషల్లో ఈ రీమేక్‌ పనులు జరుగుతున్నాయి. అయితే తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇతర భాషల్లో రీమేక్‌ పనులు జరుగుతున్నా తెలుగు వర్షన్‌ను మాత్రం పక్కన పెట్టేశారు. తాజా మరో దర్శకుడితో క్వీన్‌ తెలుగు రీమేక్‌ను కొనసాగించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.

నాని నిర్మాతగా మారి రూపొందించిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మ, క్వీన్‌ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా ప్రశాంత్‌ వర్మ టేకింగ్‌ కు మంచి స్పందన వచ్చింది. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్‌లో కాజల్‌, మలయాళ వర్షన్‌లో మంజిమా మోహన్‌, కన్నడ వర్షన్‌లో పరుల్‌ యాదవ్‌లు లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement