వారం రోజుల్లో 300కోట్లు కొల్లగొట్టింది

Avengers Endgame Collection 300 Crores In A Week In India - Sakshi

‘అవెంజర్స్‌’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ ఉందో అందరికి తెలిసిన సంగతే. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ గత శుక్రవారం విడుదలైంది. ఇండియా వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. చైనాలో అయితే ఇప్పటికే 700కోట్లను కలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇక మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8వేల కోట్లను కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ చిత్రం ఇండియాలో వారం రోజుల్లోనే 300కోట్లను కలెక్ట్‌ చేసినట్లు ట్రేడ్‌వర్గాలు తెలిపాయి. ‘ఇన్ఫినిటీవార్‌’ లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ను 2 రోజుల్లో ‘ఎండ్‌గేమ్‌’ దాటేసింది. సూపర్‌ హీరో క్యారక్టర్స్‌ అయిన ఐరన్‌మేన్, కెప్టెన్‌ అమెరికా, హల్క్, థోర్, స్పెడర్‌ మేన్, బ్లాక్‌ ప్యాంథర్‌లను ఓ చోట చేర్చి మార్వెల్‌ సంస్థ తొలుత ‘ది అవెంజర్స్‌’ను  రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత ‘అవెంజర్స్‌ : ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’, ‘ఇన్ఫినిటీ వార్‌’ చిత్రాలు వచ్చాయి.  ఆ చిత్రాల ముగింపే ‘ఎండ్‌గేమ్‌’. ఈ చిత్రం తర్వాత మళ్లీ సూపర్‌ హీరోల పాత్రలు  కనిపించకపోవచ్చు. అందుకే ఎన్నిసార్లు చూసినా చివరిసారి చూడటం ప్రత్యేకమన్నట్టు మార్వెల్‌ అభిమానులు మళ్లీ మళ్లీ ‘ఎండ్‌ గేమ్‌’చిత్రాన్ని వీక్షిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top