‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ మళ్లీ వస్తోంది!

Avengers Endgame to be Re Released With New Footage - Sakshi

మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్‌ హిట్ సూపర్‌ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవెంజర్స్‌ : ది ఎండ్‌ గేమ్‌. దీంతో ఈ సినిమా ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు అని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సినిమాకు భారీగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరిగాయి. రిలీజ్ తరువాత పాజిటివ్‌ టాక్‌ రావటంతో వసూళ్ల పరంగానూ ఎండ్‌ గేమ్ సంచలనాలు సృష్టించింది.

ఆ ఊపు చూసి అవతార్‌ రికార్డ్‌లను అవెంజర్స్‌ చెరిపేస్తుందని భావించారు చిత్రయూనిట్. కానీ మూడు వారాల తరువాత సీన్‌ మారిపోయింది. వరల్డ్‌ కప్‌ కూడా స్టార్‌ అవ్వటంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో మార్వెల్‌ సంస్థ కొత్త ప్లాన్ వేసింది. ఒరిజినల్‌ కంటెంట్‌ నుంచి మరికొం‍త ఫుటేజ్‌ను యాడ్‌ చేసి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అవతార్‌ రికార్డులు అందుకోవచ్చని భావిస్తున్నారు చిత్రయూనిట్‌. మరి మార్వెల్‌ ప్లాన్ ఎంత వరకు వర్క్‌ అవుట్ అవుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top