super heroes
-
‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ మళ్లీ వస్తోంది!
మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సూపర్ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవెంజర్స్ : ది ఎండ్ గేమ్. దీంతో ఈ సినిమా ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు అని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ రావటంతో వసూళ్ల పరంగానూ ఎండ్ గేమ్ సంచలనాలు సృష్టించింది. ఆ ఊపు చూసి అవతార్ రికార్డ్లను అవెంజర్స్ చెరిపేస్తుందని భావించారు చిత్రయూనిట్. కానీ మూడు వారాల తరువాత సీన్ మారిపోయింది. వరల్డ్ కప్ కూడా స్టార్ అవ్వటంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో మార్వెల్ సంస్థ కొత్త ప్లాన్ వేసింది. ఒరిజినల్ కంటెంట్ నుంచి మరికొంత ఫుటేజ్‌ను యాడ్ చేసి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అవతార్ రికార్డులు అందుకోవచ్చని భావిస్తున్నారు చిత్రయూనిట్. మరి మార్వెల్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
అవెంజర్స్ అద్భుతహా
‘అవెంజర్స్ చూశావా? టికెట్స్ దొరికాయా? ఐరన్‌మేన్ మస్త్ కదా! కెప్టెన్ అమెరికా సూపర్. హల్క్ కుమ్మేశాడు’... ప్రస్తుతం ప్రపంచ సినీప్రియుల మధ్య వినిపిస్తున్న డిస్కషన్లలో కామన్ టాపిక్ అవెంజర్స్... అవెంజర్స్. అసలెవరండీ ఈ అవెంజర్స్. అంత మొనగాళ్లా? మొనగాళ్లే. ప్రపంచాన్ని కాపాడే ఈ సూపర్ హీరోల సాహస విన్యాసాలు బాక్సాఫీస్ మీద డాలర్లు, రూపాయిలు, దినాముల వర్షం కురిపిస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా పాత రికార్డులను బద్దలు కొడుతోంది అవెంజర్స్. మల్టీప్లెక్సుల్లో టికెట్ల కొరత సృష్టిస్తోంది అవెంజర్స్. అసలెవరండీ ఈ సూపర్ హీరోలు అమెరికన్ కామిక్ పుస్తకాల్లో పురుడు పోసుకున్న ఈ సూపర్ హీరోలు 2008 నుంచి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం మొదలెట్టారు. ‘ఐరన్‌మేన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, స్పెడర్ మేన్, బ్లాక్ ప్యాంథర్’ ఇలా కామిక్ పాత్రలను స్క్రీనీకరిస్తూ వచ్చింది మార్వెల్. సూపర్ హీరోలూ తమ ఆనవాయితీగా వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చారు. ఒక్కొక్క సూపర్ హీరో విధ్వంసమే ఇలా ఉంటే వీళ్లను ఒకేచోట అసెంబుల్ చేస్తే? ఈ ఆలోచనతో సూపర్ హీరోలందరితో ‘ది అవెంజర్స్’ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘ఇన్ఫినిటీ వార్’ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల ముగింపే ‘ఎండ్‌గేమ్’. ఈ చిత్రం తర్వాత మళ్లీ సూపర్ హీరోల పాత్రలు కనిపించకపోవచ్చు. అందుకే ఎన్నిసార్లు చూసినా చివరిసారి చూడటం ప్రత్యేకమన్నట్టు మార్వెల్ అభిమానులు మళ్లీ మళ్లీ ‘ఎండ్ గేమ్’చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ‘‘ఎండ్‌గేమ్’ చూస్తున్నప్పుడు మన ప్రాంతీయ భాష సినిమా అనే ఫీల్ కలిగించాలనే ఉద్దేశంతో సంభాషణల పరంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. రెహమాన్‌తో స్పెషల్ సాంగ్ చేయించడానికి కారణం కూడా ఇదే . ఈ చిత్రాన్ని తమ థియేటర్స్‌లో ప్రదర్శించాలనుకుంటున్నాం అని ఎగ్జిబిటర్స్ తమంతట తాము ముందుకు వచ్చారు. అమెరికాలో సృష్టించబడిన అవెంజర్స్ ఆంధ్రా, తెలంగాణలోనూ అభిమానాన్ని ఏ స్థాయిలో సంపాదించాయో అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్ఫినిటీవార్’ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను 2 రోజుల్లో ‘ఎండ్‌గేమ్’ దాటేసింది. మొదటి రెండు రోజుల వసూళ్ల పరంగా ఇప్పటి వరకూ డబ్బింగ్ సినిమాల్లో నంబర్ వన్‌గా నిలిచింది. హిందీ, తమిళ భాషలతో పోలిస్తే మన టికెట్ రేట్లు తక్కువ. అయినప్పటికీ వాటితో పోటీగా ఈ సినిమా కలెక్షన్స్ సాధిస్తోంది’’ అని ‘అవెంజర్స్’ చిత్రం మార్కెటింగ్ ప్రతినిధి పేర్కొన్నారు. చెడు(విలన్) పై మంచి(హీరో) ఎప్పుడూ గెలుస్తుంది. కొన్నిసార్లు సమయం పడుతుందంతే. సినిమా పరిభాషల్లో అల్టిమేట్ కమర్షియల్ ఫార్ములా ఇది. తెలుగు మాస్ సినిమా అయినా హాలీవుడ్ సూపర్ హీరో సినిమా అయినా ఇదే మంత్రం. కాబట్టి ‘అవెంజర్స్’ మనకు ఇంతలా కనెక్ట్ అయిందనుకోవచ్చు. అందుకే ఇది ఎండ్‌గేమ్ కాదు బాక్సాఫీస్ బెండ్ తీస్తున్న సూపర్ హీరోల గేమ్. -
‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఎలా ఉందంటే!
ప్రస్తుతం ప్రపంచమంతా అవెంజర్స్ ఫీవర్స్ కనిపిస్తుంది. ఎన్నికలు, ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా.. భారత్‌లోనూ ఈ ఫీవర్ గట్టిగానే కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూ లైన్లు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. ఇతంటి భారీ అంచనాల మధ్య శుక్రవారం ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సూపర్ హీరో సీరిస్‌లో ఈ సినిమా చివరిది కూడా కావటంతో ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు అని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇంతటి భారీ సిరీస్‌కు ముగింపు ఎలా ఇచ్చారు.? చివరకు సూపర్ హీరోస్ అంతా ఏమయ్యారో తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఎదురుచూసింది. గత చిత్రం ఇన్ఫినిటీ వార్‌ను ఎక్కడ ముగించారో అక్కడి నుంచే ఎండ్ గేమ్ కథను ప్రారంభించారు. ఇన్ఫినిటీ వార్‌లో ఓటమి పాలైన అవెంజర్స్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతారు. తన దగ్గర ఉన్న మణుల శక్తితో విశ్వంలోని సగం ప్రాణికోటిని అంతం చేసిన థానోస్‌ను అంతమొందిస్తారు. ఇది జరిగిన 5 సంవత్సరాల తరువాత అవెంజర్స్‌కు మరో విషయం తెలుస్తుంది. టైం మేషీన్ ద్వారా గతంలోకి వెళ్లి, థానోస్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగించిన మణులను సాధించగలిగితే.. చనిపోయిన వారందరినీ తిరిగి బతికించగలమని తెలుస్తోంది. ఆ మణులను సాదించేందుకు అవెంజర్స్ ఎలాంటి సాహసాలు చేశారు.? ఈ ప్రయత్నంలో వాళ్లకు ఎదురైన సమస్యలేంటి.? వాళ్లు అనుకున్నట్టుగా ప్రాణికోటిని తిరిగి బతికించగలిగారా..? అన్నదే ఎండ్ గేమ్ కథ. (చదవండి : గూగుల్‌లో 'థానోస్' అని సెర్చ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?) గత చిత్రాలతో పోలిస్తే ఎండ్‌గేమ్‌ను మరింత ఎమోషనల్‌గా రూపొందించారు. ఒక్క హల్క్ మినహా ప్రతీ పాత్రను తమకు ఇష్టమైన వాటిని కోల్పోయిన నేపథ్యం తోనే నడిపించారు. ఈ సిరీస్‌లోని గత చిత్రాలు ఎక్కువగా హీరోయిజం, కామెడీ, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కగా.. ఎండ్ గేమ్ మాత్రం అనుబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా తెరకెక్కించారు. అయితే అవెంజర్స్ సినిమాలను ఇష్టపడే అభిమానులను మాత్రం నిరాశపరచలేదు. కామెడీతో పాటు భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అలరిస్తాయి. ముఖ్యంగా అవెంజర్స్ సిరీస్‌లో కనిపించిన ప్రతీ సూపర్ హీరోను క్లైమాక్స్‌లో భాగం చేసి అభిమానులకు మరింత కనువిందు చేశారు చిత్రయూనిట్. తమకు అలవాటైన పాత్రల్లో హాలీవుడ్ స్టార్స్ ఒదిగిపోయారు. గ్రాఫిక్స్, సెట్స్ సినిమాను విజువల్ వండర్‌గా మార్చేశాయి. తొలి భాగం అంతా పాత్రలను తిరిగి కలిపేందుకు తీసుకున్న దర్శకులు కథను కాస్త నెమ్మదిగా నడిపించారు. ద్వితీయార్థం అంతా ఎమోషనల్ సీన్స్‌తో నడిపించి క్లైమాక్స్ కు వచ్చే సరికి కళ్లు చెదిరే భారీ యాక్షన్‌తో ముగించారు. గత చిత్రాలు చూడని వారికి కాస్త గందరగోళంగా అనిపించినా.. ఓవరాల్‌గా ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఆడియన్స్‌కు కొత్త అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు. -
మార్వెల్‌కు మాట సాయం
మార్వెల్, డీసీ సంస్థల నుంచి వచ్చే సూపర్ హీరోల చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. మనదేశం కూడా మినహాయింపు కాదు. ఇటీవల అది డబులైంది. ఆ క్రేజ్‌ని డబ్బులు చేసుకోవడానికి మన హీరోలతో డబ్బింగ్ చెప్పించడం చేస్తున్నాయి ఆయా సంస్థలు. లేటెస్ట్గా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తమిళ అనువాద చిత్రానికి దర్శకుడు మురుగదాస్‌తో డైలాగ్స్ రాయించారట. ‘‘మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాల స్కేల్, స్టోరీ చెప్పే విధానం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. సూపర్ హీరోల సినిమాకు మా అబ్బాయి ఆదిత్య చాలా పెద్ద ఫ్యాన్స్. దాంతో నాకు ఇంకా ఎగై్జటింగ్‌గా ఉంది. డైలాగ్స్ కథకు తగ్గట్టుగా ఉండటంతో పాటు తమిళ ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను’’ అని దర్శకుడు మురుగదాస్ పేర్కొన్నారు. -
సమస్యలను భూతద్దంలో చూడకండి...
మంచి మాట హృతిక్ రోషన్, హీరో - విషాదం మూర్తీభవించిన వ్యక్తి, ప్రతి విషయం లోనూ ప్రతికూల ఫలితాలనే ఊహించే వ్యక్తి... తాను సుఖంగా ఉండలేడు. చుట్టూ ఉన్న వాళ్లను సంతోషపెట్టలేడు. - ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అంతమాత్రాన అదే పనిగా ఆందోళన చెందనవసరం లేదు. దుఃఖించాల్సిన పని అంతకంటే లేదు. బాధ పడుతూ కూర్చో వడం వల్ల... సమస్య ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. - ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామనేది పెద్దవిషయం కాదు... వాటి నుంచి ఎంత ఆత్మస్థైర్యంతో బయటపడుతున్నామనేది ముఖ్యం. - బలహీన సందర్భాలు ఎదురైనప్పుడు, అప జయాలు చుట్టుముట్టినప్పుడు... జీవితాన్ని ఆశావహదృక్పథం నుంచి చూడడం మొదలు పెడతాను. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది. - ప్రతి మనిషిలోనూ సమస్యలపై పోరాడే మహత్తర శక్తి ఉంటుంది. కొందరు ఆ శక్తిని గుర్తిస్తారు. మరికొందరు గుర్తించరు. అంతేతేడా! - మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే, మనం ప్రపంచాన్ని చూసే పద్ధతి ఆధారపడి ఉంటుంది. - కండలు పెంచి, బిల్డింగ్‌ల మీద నుంచి దూకేవారు సూపర్ హీరోలు కాదు. విలువలతో జీవించేవారే సూపర్ హీరోలు! - నిత్యజీవితంలో సంతోషం అనేది... ఒక పుస్తకం చదవడం ద్వారా లభించవచ్చు. ఒక పాత పాట వినడం ద్వారా లభించవచ్చు. చివరికి ఒక జోక్ ద్వారా కూడా దొరకవచ్చు! -
సూపర్ హీరోస్.. ఫ్లాప్ హీరోయిన్స్