మార్వెల్‌కు మాట సాయం | A.R. Murugadoss enters 'Avengers: Endgame' | Sakshi
Sakshi News home page

మార్వెల్‌కు మాట సాయం

Feb 17 2019 6:33 AM | Updated on Feb 17 2019 6:34 AM

A.R. Murugadoss enters 'Avengers: Endgame' - Sakshi

మార్వెల్, డీసీ సంస్థల నుంచి వచ్చే సూపర్‌ హీరోల చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంటుంది. మనదేశం కూడా మినహాయింపు కాదు. ఇటీవల అది డబులైంది. ఆ క్రేజ్‌ని డబ్బులు చేసుకోవడానికి మన హీరోలతో డబ్బింగ్‌ చెప్పించడం చేస్తున్నాయి ఆయా సంస్థలు. లేటెస్ట్‌గా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తమిళ అనువాద చిత్రానికి దర్శకుడు మురుగదాస్‌తో డైలాగ్స్‌ రాయించారట. ‘‘మార్వెల్‌ సంస్థ నుంచి వచ్చే సినిమాల స్కేల్, స్టోరీ చెప్పే విధానం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. సూపర్‌ హీరోల సినిమాకు మా అబ్బాయి ఆదిత్య చాలా పెద్ద ఫ్యాన్స్‌. దాంతో నాకు ఇంకా ఎగై్జటింగ్‌గా ఉంది. డైలాగ్స్‌ కథకు తగ్గట్టుగా ఉండటంతో పాటు తమిళ ఫ్లేవర్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను’’ అని దర్శకుడు మురుగదాస్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement