అత్తారింటికి దారేది పైరసీ పాలుకావడం బాధాకరం | Attarintiki daredi piracy makes pain: Producer | Sakshi
Sakshi News home page

అత్తారింటికి దారేది పైరసీ పాలుకావడం బాధాకరం

Sep 24 2013 3:01 AM | Updated on Mar 22 2019 5:33 PM

అత్తారింటికి దారేది పైరసీ పాలుకావడం బాధాకరం - Sakshi

అత్తారింటికి దారేది పైరసీ పాలుకావడం బాధాకరం

‘‘వందలాది మంది శ్రమతో కొన్ని నెలలు, కొన్ని కోట్ల రూపాయలతో చేసిన సినిమా ఇలా పైరసీ పాలు కావడం బాధాకరం. ఇది నీచమైన చర్య. ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి.

 ‘‘వందలాది మంది శ్రమతో కొన్ని నెలలు, కొన్ని కోట్ల రూపాయలతో చేసిన సినిమా ఇలా పైరసీ పాలు కావడం బాధాకరం. ఇది నీచమైన చర్య. ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి. ఈ సమయంలో ఇలా పైరసీ చేయడం చాలా దారుణం. పవన్‌కల్యాణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ పైరసీని అరికట్టాలి’’ అని బీవీయస్‌యన్ ప్రసాద్ ఆవేదనగా మాట్లాడారు. 
 
  , సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అత్తారింటికి దారేది. ఈ 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈలోపు ఈ చిత్రం పైరసీకి గురయ్యి, కొన్ని వెబ్‌సైట్స్‌లో వీరవిహారం చేయడంతో పాటు, సీడీ, డీవీడీల రూపంలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ -‘‘క్యూబ్, పీఎక్స్‌డీ.. ఇలా పలు విధానాలు ఉండటంవల్ల ఏ రూపంలో పైరసీ జరిగిందో ఇంకా నిర్ధారణ కాలేదు. 
 
 90 నిమిషాల నిడివి ఉన్న సినిమాని వెబ్‌సైట్స్‌లో పెట్టారని విని, తీయించి వేశాం. పైరసీదారులను క్షమించేది లేదు. డౌన్‌లోడ్ చేసినవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. యాంటీ పైరసీ సెల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ఈ లింక్‌ను కాలిఫోర్నియాలో అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇన్‌వాల్వ్ అయినవారి కూపీ లాగుతున్నాం.
 
 ఇప్పటికే ముగ్గురు, నలుగురు పట్టుబడ్డారు. ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, చీటింగ్ కేస్ కింద పైరసీదారులు, వారిని ప్రోత్సహిస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తాం. డీవీడీలు, సీడీలు అమ్ముతున్న విషయాన్ని ప్రతి జిల్లాకి చెందిన పోలీసాధికారులకు సమాచారం అందించా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement