నిజం చెప్పడం నా వృత్తి | arjun suravaram release date fixed | Sakshi
Sakshi News home page

నిజం చెప్పడం నా వృత్తి

Nov 14 2019 1:07 AM | Updated on Nov 14 2019 1:07 AM

arjun suravaram release date fixed - Sakshi

నిఖిల్, లావణ్యా త్రిపాఠి

‘ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ, ఒక నిజాన్ని నిజం అని ప్రూవ్‌ చేయడం చాలా కష్టం. నా పేరు అర్జున్‌ సురవరం లెనిన్‌. జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్‌’ అంటూ మొదలయ్యే ‘అర్జున్‌ సురవరం’ సినిమా టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’.

నిర్మాత ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ ఎల్‌ పి పతాకంపై రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా పోస్టర్స్‌కు, టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. పవర్‌ ఫుల్‌ కంటెంట్‌తో రూపొందిన మా మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, తరుణ్‌ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్, కెమెరా: సూర్య.

Advertisement
 
Advertisement
Advertisement