‘అర్జున్‌ రెడ్డి’ తమిళ్‌ టీజర్‌ వచ్చేసింది! | Arjun Reddy Tamil Remake Varma Teaser Out | Sakshi
Sakshi News home page

Sep 23 2018 11:57 AM | Updated on Sep 23 2018 4:33 PM

Arjun Reddy Tamil Remake Varma Teaser Out - Sakshi

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘అర్జున్‌ రెడ్డి’ పలు భాషల్లోకి రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్‌లో సందీప్‌ వంగా డైరెక్షన్‌లో షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కుతోంది. తమిళ్‌లో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా అర్జున్‌ రెడ్డిని ‘వర్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ బాలా.. ఈ రీమేక్‌ను తమిళ నేటీవిటికి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. మరి ఈ రీమేక్‌ కోలీవుడ్‌లో సంచలనం సృష్టించి..ధృవ్‌ని కూడా ఓవర్‌నైట్‌ స్టార్‌ చేస్తుందో లేదో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement