తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Arjun Reddy Remake Adithya Varma Release Date Announced | Sakshi
Sakshi News home page

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Aug 8 2019 2:15 PM | Updated on Aug 8 2019 2:17 PM

Arjun Reddy Remake Adithya Varma Release Date Announced - Sakshi

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి సినిమా బాలీవుడ్‌లోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో కబీర్‌ సింగ్ పేరుతో రిలీజ్‌ అయిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా అర్జున్‌ రెడ్డి తమిళ రీమేక్‌ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అర్జున్‌ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలసిందే. విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాల దర్శకత్వం వహించారు. అయితే బాల రూపొందించిన సినిమాతో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు.

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సెప్టెంబర్‌ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ధృవ్‌ సరసన బనిటా సందు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతమందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement