గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే! | Arjun Kapoor Shares His Old Age Pic Have A Look | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

Jul 17 2019 2:41 PM | Updated on Jul 17 2019 2:43 PM

Arjun Kapoor Shares His Old Age Pic Have A Look - Sakshi

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వృద్ధుడైన తర్వాత తన రూపం ఎలా ఉంటుందో ఓ యాప్‌ ద్వారా ఫొటో తీసుకున్న అర్జున్‌.. దానిని తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేశాడు. ‘వృద్ధాప్యంలో నేను ఇలా ఉంటానా... గుర్తుపట్టారా’ అంటూ అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో రాసుకొచ్చాడు. కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిన ఈ ఫొటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఓల్డ్‌మాన్‌ చాలా అందంగా ఉన్నావ్‌’ అంటూ అర్జున్‌ బాబాయ్‌ సంజయ్‌ కామెంట్‌ చేయగా...మరికొంత మంది మాత్రం ఈ గెటప్‌లో అచ్చం సంజయ్‌లా ఉన్నావు అంటూ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ సక్సేనాతో పోలుస్తున్నారు.

ఇక అర్జున్‌ కజిన్‌ సోనమ్‌ కపూర్‌ కూడా సదరు యాప్‌ ద్వారా వృద్ధాప్యంలో తానెలా ఉంటారో తెలిపే ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ 75- 80 ఏళ్ల వయస్సులో ఈమె ఎలా ఉన్నారో చూడండి. నిజంగా తను చాలా అందంగా ఉంది కదా. తను ఎల్లప్పటికీ అందాల రాణిగానే ఉంటుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా వరుణ్‌ ధావన్‌ కూడా తన ఓల్డేజ్‌ ఫొటోను షేర్‌ చేసి... అనిల్‌ కపూర్‌ నూరేళ్ల వయస్సులో ఎలా ఉంటారో నేను 70 ఏళ్లకే అలా ఉన్నాను కదా అంటూ చమత్కరించాడు.

Old age hit me like .. 👀

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

Advertisement
 
Advertisement
Advertisement