అరు కథల్ని నడిపించే ఏడో కథ | Archana in a horror film | Sakshi
Sakshi News home page

అరు కథల్ని నడిపించే ఏడో కథ

Sep 4 2014 11:37 PM | Updated on Sep 2 2017 12:52 PM

అరు కథల్ని నడిపించే ఏడో కథ

అరు కథల్ని నడిపించే ఏడో కథ

రవిబాబు, అర్చన, వినోద్‌కుమార్, భానుశ్రీమెహ్రా, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా, ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్.పద్మజ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది.

రవిబాబు, అర్చన, వినోద్‌కుమార్, భానుశ్రీమెహ్రా, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా, ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్.పద్మజ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. భీమినేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహిం చారు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. ‘‘భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది.
 
  ఇందులోని ఆరు కథలను ఏడో కథ ముందుకు నడిపిస్తుంది. చక్కని థ్రిల్లర్. పాటలు ఉండవు. శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. అభినయానికి ఆస్కారమున్న పాత్ర పోషిస్తున్నానని అర్చన చెప్పారు. ఓ టిపికల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి దర్శకుడే నిజమైన హీరో అని ఉత్తేజ్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: పార్వతీచంద్, కెమెరా: ఉదయభాస్కర్ జాస్తి, సంగీతం: తారక రామారావు.
 

Advertisement
 
Advertisement
Advertisement