‘స్పిరిట్‌’ కోసం గొర్రెలు అమ్ముకున్నాం.. చాలా కష్టపడ్డాం | Spirit Movie Audio Launch Highlights | Sakshi
Sakshi News home page

గొర్రెలు అమ్ముకొని సినిమా తీశాం.. ఎగతాళి చేసినా పట్టించుకోలేదు

Apr 29 2026 2:45 PM | Updated on Apr 29 2026 2:55 PM

Spirit Movie Audio Launch Highlights

– చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు  

‘‘ఈ వేదికపైకి రావడానికి చాలా కష్టపడ్డాం. మాకున్న గొర్రెలన్నిటినీ అమ్ముకొని మా కుమారుడు రవీంద్రనాథ్‌ దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమా తీశాం. అందరూ మమ్మల్ని ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. అయితే మా కష్టం చూసిన వారు మాత్రం సపోర్ట్‌ చేశారు. ‘స్పిరిట్‌’ మా ఒక్కరిది కాదు... మనందరి సినిమా. చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని నిర్మాతలు చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు తెలిపారు. 

రవిబాబు, సత్య ప్రకాశ్, ‘చిత్రం’ శీను, గడ్డం నవీన్, జూనియర్‌ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలీ ముఖ్య తారలుగా సీహెచ్‌ రవీంద్రనాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పిరిట్‌’. రైతులు చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమా మే 8న విడుదల కానుంది. ఎస్‌ఎస్‌ వెంకటేశ్, సంతోష్‌ కావాలా సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ వేడుకలో దర్శకుడు వి. సముద్ర, కె. మోహన్, నిర్మాతలు అశోక్‌ కుమార్, ముత్యాల రాందాస్‌ ముఖ్య అతిథులుగా హాజరై, ‘స్పిరిట్‌’ హిట్‌ అవ్వాలని ఆకాంక్షించారు.

 సీహెచ్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ– ‘‘అందరికీ తల్లిదండ్రులు జన్మనిస్తే.. నాకు మాత్రం జన్మతో పాటు సినీ జీవితాన్ని కూడా ఇచ్చారు నా తల్లిదండ్రులు. ‘స్పిరిట్‌’ చాలా బాగా వచ్చింది. అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌కమల్‌ పి. భరత్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement