'ఫస్ట్ డేనే అలా చేయడం తప్పు.. ఫ్రీ షోలు వేయాలి' | Director Ravi Babu Sparks Debate With Comments On Fans And Ticket Pricing, Read Story For More Details | Sakshi
Sakshi News home page

Ravi Babu: 'ఫస్ట్ రోజు ఫ్యాన్స్‌కు ఫ్రీగా చూపించాలి'

May 3 2026 3:44 PM | Updated on May 3 2026 4:26 PM

Tollywood director Ravi Babu comments about Hero Fans

డైరెక్టర్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో రవిబాబు ఒకరు. తన టాలెంట్‌తో దర్శకుడిగా మాత్రమే కాదు.. హీరోగా కూడా మెప్పించారు. అలా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం రేజర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 8న విడుదల కానుంది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఇండస్ట్రీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా హీరోల అభిమానుల గురించి కూడా రవిబాబు ప్రస్తావించారు. వారి వల్లే హీరోలకు క్రేజ్ ఉందన్న మనందరికీ తెలుసు కదా అన్నారు. అలాంటప్పుడు ఫస్ట్ రోజే వాళ్ల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాగడమేంటని ప్రశ్నించారు. మొదటి రోజు ఫ్యాన్స్‌కు ఉచితంగా సినిమా వేయొచ్చు కదా అని సూచించారు. నువ్వు రెండో రోజు నుంచి రూ.1000 తీసుకున్నా ఫర్వాలేదని రవిబాబు అన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


 

Advertisement
 
Advertisement
Advertisement