Ugly Story: ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించాం | Ugly Story Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

Ugly Story: ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించాం

May 7 2026 6:11 AM | Updated on May 7 2026 11:42 AM

Ugly Story Movie Trailer Launch

నందు, అవికా గోర్‌ జంటగా నటించిన చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్‌ ఇతర పాత్రలు పోషించారు. రియా జియా ప్రొడక్షన్స్‌పై సుభాషిణి, కొండా లక్ష్మణ్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన డైరెక్టర్‌ సాగర్‌ కె. చంద్ర ట్రైలర్‌ రిలీజ్‌ చేసి, సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రణవ స్వరూప్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే చిత్రం ‘అగ్లీ స్టోరీ’. 

ఇంటెన్స్‌ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని మలుపులతో ఈ చిత్రకథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘ఆసక్తికరమైన థ్రిల్లింగ్‌ సీన్స్‌తో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రంలోని పాత్ర సవాల్‌గా అనిపించింది’’ అన్నారు నందు. ‘‘ఇంత మంచి సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం’’ అని అవికా గోర్‌ పేర్కొన్నారు. సుభాషిణి, లక్ష్మణ్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. నందు, అవిక నటన ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం టీం చాలా కష్టపడింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికుమార్‌ దారా, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement