breaking news
ugly movie
-
Ugly Story: ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించాం
నందు, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ ఇతర పాత్రలు పోషించారు. రియా జియా ప్రొడక్షన్స్‌పై సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన డైరెక్టర్ సాగర్ కె. చంద్ర ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ– ‘‘ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని మలుపులతో ఈ చిత్రకథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్‌తో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రంలోని పాత్ర సవాల్‌గా అనిపించింది’’ అన్నారు నందు. ‘‘ఇంత మంచి సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం’’ అని అవికా గోర్ పేర్కొన్నారు. సుభాషిణి, లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. నందు, అవిక నటన ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం టీం చాలా కష్టపడింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికుమార్ దారా, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. -
అవసరమైతే ‘సుప్రీం’కెళతా అనురాగ్ కశ్యప్
ముంబై: ‘అగ్లీ’ సినిమాలో పొగ తాగే దృశ్యం వచ్చినపుడు ‘సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్’ ప్రకటన (డిస్‌క్లెయిమర్) వేయనని చెప్పినప్పటికీ సెన్సార్ బోర్డు అభ్యంతరంపై తుదివరకు పోరాడతానని దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పేర్కొన్నాడు. అవసరమైతే సుప్రీంకోర్టుదాకా వెళతానన్నాడు. అటువంటి డిస్క్లెయిమర్లతో సినిమాను విడుదల చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికెటేషన్ను సవాలుచేస్తూ అనురాగ్... బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘అది అసలు సమంజసం కాదనేది నా భావన. ఇది పూర్తిగా మతి లేని చర్య. నా విన్నపాన్ని బాంబే హైకోర్టు ఆలకించకపోతే సుప్రీంకోర్టుకు వెళతా’ అని తెలిపాడు. దర్ మోషన్ పిక్చర్స్, ఫాంటం ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన అగ్లీ సినిమా వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీనే విడుదల కావాల్సిఉంది. అయితే డిస్క్లెయిమర్లు వేసేందుకు అనురాగ్ అంగీకరించకపోవడంతో వచ్చే సంవత్సరానికి వాయిదాపడింది. ‘అటువంటి ప్రకటనలతో ఈ సినిమాను విడుదల చేయడం నాకు ఇష్టం లేదు. కడదాకా పోరాడతా. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అధికారం నాకు ఉంది. నా సినిమాలు నేను తీసుకుంటా. తీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదు. ప్రజాస్వామ్య దేశం అయినందువల్ల పోరాటాన్ని కొనసాగిస్తా. ఎందుచేతనంటే ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదురొడ్డి నిలబడాల్సిందే. పోరాటం జరపాల్సిందే. అటువంటి డిస్క్లెయిమర్లు ఎవరికైనా అవమానకరంగానే అనిపిస్తుంద’ని ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’, ‘దేవ్ డి’, ‘గులాల్’, ‘నో స్మోకింగ్’ తదితర సినిమాలతో బాలీవుడ్లో తళుక్కుమన్న అనురాగ్ చెప్పాడు.


