‘‘ఆక్వామెన్‌’’ ట్రైలర్‌ అదిరింది !

Aquaman Hollywood Movie Trailer Released - Sakshi

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాలీవుడ్‌ సూపర్‌ హీరో సినిమా ‘‘ఆక్వామెన్‌’’ ట్రైలర్‌ ఈ ఆదివారం విడుదలైంది. య్యూటూబ్‌లో విడుదలైన ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.  ‘‘వార్నర్‌ బ్రదర్స్‌’’, ‘‘శాండియాగో కామిక్‌ కాన్‌’’ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్‌ వ్యాన్స్‌ దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌ నటుడు ‘‘జాసన్‌ మొమొవా ’’ నటి ‘‘ఆంబర్‌ హీయర్డ్‌’’ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

‘‘జస్టిస్‌లీగ్‌’’ సినిమాలో కొద్దిసేపు కనిపించిన ఈ ‘‘ఆక్వామెన్‌’’ పాత్ర ఈ సినిమాతో పూర్తి స్ధాయిలో ప్రేక్షకులను అలరించనుంది. విడుదలైన ట్రైలర్‌ సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. సినిమా కూడా అంచానాలకు మించి ఉండబోతోందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా 2018 డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఇండియాలో విడుదల అవుతున్న హాలీవుడ్‌ చిత్రాలు రికార్డు స్ధాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్న నేపథ్యంలో ‘‘ఆక్వామెన్‌’’ ఏ రికార్డు సృష్టిస్తాడో చూడాలి మరి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top