28 ఏళ్ల జస్లీన్, 65 ఏళ్ల జలోటా మధ్య ఏముంది?

Anup Jalota, Jasleen Matharu Will Be Seen In Vo Meri Student Hai - Sakshi

ఏముందో తెలియాలంటే 'ఓ మేరీ స్టూడెంట్‌ హై' చూడాల్సిందే!

గజల్‌ సింగర్‌, భజన్‌ మాస్ట్రో అనూప్‌ జలోటా, బిగ్‌బాస్‌ ఫేమ్‌ జస్లీన్‌ మాథారులు ప్రేమించుకున్నట్లు తెలిపి గతంలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల జస్లీన్ మాథారు, 65 ఏళ్ల అనుప్ జలోటా జంటగా గతేడాది హిందీ బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. బిగ్‌బాస్-‌12వ సీజన్‌లో అడుగుపెట్టిన వీరిద్దరూ.. తాము మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేకాక వీరి కోసం ప్రత్యేకంగా బిగ్‌బాస్‌ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ కూడా ఏర్పాటు చేశాడు. అయితే జస్లీన్‌ ఎలిమినేట్‌ అయిన తర్వాత ఇది అంతా ప్రాంక్‌ అని కొట్టిపారేసింది. అయితే, హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం వీరిద్దరూ తమకేమి సంబంధం లేనట్లు ప్రవర్తించారు.
 

తమపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వీరిద్దరికి సంబంధించిన కథతో ఓ సినిమా నిర్మించారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో 'ఓ మేరీ స్టూడెంట్‌ హై' అనే చిత్రం తెరకెక్కింది. జస్లీన్‌ తండ్రి కేసర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గురు, శిష్యులుగా వీరిరువురూ తెరమీద కనిపించనున్నారు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం చాలామందికి ఉన్న అపోహలను తొలగిస్తోంది అని అనూప్‌ ఓ ఇంటర్యూలో తెలిపారు. గతేడాది దీపావళి కంటే ముందుగానే బిగ్‌బాస్‌లో పాల్గొని  అలజడి సృష్టించానని ఆయన ఈ సందర్భంగా ఆయన గర్తుచేశారు. చిత్ర విషయానికొస్తే.. 'ఈ చిత్రంలో జస్లీన్‌ సంగీతం నేర్చుకోవడానికి తన దగ్గరకు వస్తుందనీ అన్నారు. తాను సాంప్రదాయ సంగీత నేపథ్యం నుంచి రావడంతో.. తనను ఇబ్బంది పెట్టేలా కాకుండా.. నిండుగా ఉన్న దుస్తులు ధరించమని విసిగించే పాత్రలో కనిపిస్తానని' అని చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top