అను ఖాతాలో మరో క్రేజీ ఆఫర్‌

Anu Emmanuel Movie With Vijay Sethupathi - Sakshi

కెరీర్‌లో పెద్దగా హిట్స్‌ లేకపోయినా గ్లామర్‌ లుక్స్‌ తో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్‌ అను ఇమ్మాన్యూల్‌. మలయాళ ఇండస్ట్రీలో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ మజ్ను సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో పర్వాలేదనిపించినా తరువాత అను నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్‌ కాలేదు.

తమిళ్‌లో చేసిన ఒక్క సినిమా తుప్పారివాలన్‌ మాత్రం ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ భామ కోలీవుడ్‌ క్రేజీ హీరో సరసన నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌ సేతుపతి సరసన నటించేందుకు అను ఇమ్మాన్యూల్‌ ఓకె చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top