మరో కొత్త ప్రయత్నం | Another new attempt | Sakshi
Sakshi News home page

మరో కొత్త ప్రయత్నం

Jan 6 2015 11:46 PM | Updated on Sep 2 2017 7:19 PM

మరో కొత్త ప్రయత్నం

మరో కొత్త ప్రయత్నం

ప్రేమలో పావనీ కల్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్‌లీ వంటి చిత్రాలు నిర్మించిన


 ప్రేమలో పావనీ కల్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్‌లీ వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత బి.ఎ. రాజు మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. బి. జయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నేడు బి.ఎ. రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మంచి స్క్రిప్టు సిద్ధం చేశాం. వాణిజ్య అంశాలతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తాం. ఫిబ్రవరిలో మొదలుపెడతాం. తారాగణం, సాంకేతికవర్గ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement