కీర్తిసురేష్‌కు మరో బంపర్‌ ఆఫర్‌ | Another bumper offer to keerthi suresh | Sakshi
Sakshi News home page

కీర్తిసురేష్‌కు మరో బంపర్‌ ఆఫర్‌

Jan 24 2017 1:48 AM | Updated on Sep 5 2017 1:55 AM

కీర్తిసురేష్‌కు మరో బంపర్‌ ఆఫర్‌

కీర్తిసురేష్‌కు మరో బంపర్‌ ఆఫర్‌

నటి కీర్తిసురేష్‌ ఇప్పుడు విజయాలకు చిరునామాగా మారారు

నటి కీర్తిసురేష్‌ ఇప్పుడు విజయాలకు చిరునామాగా మారారు. తొలి చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం యావరేజ్‌ అనిపించుకున్నా ఆ తరువాత చిత్రం రజనీమురుగన్ సంచలన విజయాన్ని సాధించి కీర్తిసురేష్‌ మార్కెట్‌ను కోలీవుడ్‌లో సుస్థిరం చేసింది. ఆ తరువాత నటించిన రెమో ఆమె స్థాయిని మరింత పెంచింది. ఇక ఇటీవల ఇళయదళపతి విజయ్‌తో నటించిన భైరవా చిత్రం కీర్తిను స్టార్‌ హీరోయిన్ ను చేసిందని చెప్పకతప్పదు. ఇలా కీర్తి ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారిపోయారు.

మధ్యలో ధనుష్‌తో రొమాన్స్  చేసిన తొడరి చిత్రంలో ఆమె నటన ప్రశంసలను అందుకుంది. తాజాగా మరో స్టార్‌ హీరో సూర్య సరసన తానాసేర్న్‌ద కూటం చిత్రంలో నటిస్తున్నారు. మరో పక్క తెలుగులో పవన్ కల్యాణ్‌తో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతున్నారు. ఇక నానీతో నటించిన నేను లోకల్‌ చిత్రం ఫిబ్రవరి 3న తెరపైకి రానుంది. ఇంత బిజీగా ఉన్న కీర్తికి మరో అవకావం వరించింది. విశాల్‌కు జంటగా నటించడానికి సై అన్నారు. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్  చిత్రంలో నటిస్తున్న విశాల్‌ తదుపరి లింగుస్వామి దర్శకత్వంలో సండైకోళి–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

సూపర్‌హిట్‌ చిత్రం సండైకోళి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెల సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. చాలా గ్యాప్‌ తరువాత లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. దీన్ని విశాల్‌ తన ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నారు. కాగా దీని తరువాత లింగుస్వామి, టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లుఅర్జున్ ల కలయికలో తెరకెక్కనున్న ద్విభాషా చిత్ర నాయకీ అవకాశం కీర్తినే వరించిందన్నది గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement