మరాఠీ నుంచి... | 'Andhra Pori' shooting completed | Sakshi
Sakshi News home page

మరాఠీ నుంచి...

Mar 6 2015 11:36 PM | Updated on Sep 2 2017 10:24 PM

మరాఠీ నుంచి...

మరాఠీ నుంచి...

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆంధ్రా పోరి’.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆంధ్రా పోరి’. ఉల్కా గుప్తా కథానాయిక. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేశ్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మరాఠీ లో వచ్చిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం.

దర్శకుడు కమిట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా అందరినీ ఆక ట్టుకుంటుంది’’ అని చెప్పారు. పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చే శామని ఆకాశ్ పూరీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డా.జె, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: ప్రవీణ్ వనమాలి.

Advertisement
 
Advertisement
Advertisement