హాట్‌ లుక్స్‌తో అదరగొడుతున్న శ్రీముఖి | Anchor Sreemukhi Latest Photoshoot Images | Sakshi
Sakshi News home page

హాట్‌ లుక్స్‌తో అదరగొడుతున్న శ్రీముఖి

Jan 31 2020 8:38 PM | Updated on Feb 1 2020 11:39 AM

Anchor Sreemukhi Latest Photoshoot Images - Sakshi

బుల్లితెరపై తన ప్రతిభతో మెప్పించిన శ్రీముఖి బిగ్‌ బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఓ వైపు టీవీ షోలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఇప్పటికే జులాయి, నేను శైలజ, జెంటిల్‌మన్‌ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన ‘మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ ఆన్‌ టీవీ’ పోల్‌లో శ్రీముఖి నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖికి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే ఆ ఆంగ్ల ప్రతిక నిర్వహించిన పోల్‌లో వర్షిణి 4వ స్థానంలో, రష్మి 5 స్థానంలో, మంచు లక్ష్మి 12వ స్థానంలో, అనసూయ 14 స్థానంలో నిలిచారు.  

అయితే ఇప్పటి వరకు కనిపించని విధంగా శ్రీముఖి తన హాట్‌ లుక్స్‌తో నెటిజన్ల హృదయాలను దోచేస్తుంది. బిగ్‌బాస్‌ భామ అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు సంప్రదాయమైన దుస్తులతో కనిపించిన శ్రీముఖి ఒక్కసారిగా హాట్‌ ఫోటోలను షేర్‌ చేయడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో భారీ స్థాయిలో అభిమానుల నుంచి రెస్పాన్స్‌ వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement